Chandrababu Brings Krishna Water to Kuppam
*అపర భగీరథుడు ఏపీ సీఎం చంద్రబాబు.
*హంద్రీ-నీవా జిలాలతో కుప్పం సస్యశ్యామలం
*30న కుప్పంలో కృష్ణా జలాలకు హారతినివ్వనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు..
*ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం..
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు,ఢిల్లీ(
నేటి ధాత్రి) ఆగస్టు 21:
రాయలసీమ ప్రాంతంలోని ప్రతి ఆయికట్టుకు నీరందించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి.., అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపర భగీరథుడిలా అహర్నిశలు శ్రమిస్తున్నారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు. కుప్పం నియోజకవర్గాన్ని హంద్రీ-నీవా జిలాలతో సస్యశ్యామలం చేయడమే తన సంకల్పంగా భావించి, ముందుకు సాగుతుండడం ఏపీ సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
పార్లమెంట్ సమావేశాలకు హాజరై దేశరాజధాని ఢిల్లీలో ఉన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో కృష్ణా జలాలకు హారతి పట్టనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కృషిని.., పాలనా దక్షతను శుక్రవారం ఓ ప్రకటనలో కొనియాడారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ. ఆయన నిత్య శ్రామికుడనీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప పరిపాలనాదక్షుడంటూ ప్రశంసించారు. అంతేకాకుండా
ఇటు అధికారులు.
అటు కూటమి నాయకులు, కార్యకర్తలకు సీఎం స్పూర్తిగా నిలవడం అభినందనీయమన్నారు.
వైసిపి ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరుగులు తీయించిందన్నారు. సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని తెలిపారు. 530 కోట్ల వ్యయంతో 265 కిలోమీటర్ల కాల్వ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి, కృష్ణా జలాలు కుప్పానికి చేరుకునేందుకు శ్రమించిన అధికారులను ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు.
