
సభకు బయల్దేరిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
కాంగ్రెస్ పార్టీతోనే దేశ ప్రగతి సాధ్యం
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలం కేంద్రంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు చలో తుక్కు గూడ జనజాతర సభకు బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు ఈ క్రమంలో బుచ్చిరెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రగతి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం.లోక్ సభ ఎన్నికలలో దేశమంతా అమలుపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధితోపాటు పేదల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ పోటీలోనే లేదని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజా ర్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయుటకు ప్రతి కాంగ్రెస్ సైనికుడు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.