Chalo Indira Park for 42% BC Reservation
అక్టోబర్ 24న చలో ఇందిరా పార్క్
గోడపత్రికను ఆవిష్కరించిన కొత్తూరు రవీందర్
భూపాలపల్లి నేటిధాత్రి
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 42% రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ అక్టోబర్ 24 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మహా ధర్నా చేయడం జరుగుతుంది.
విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్లు తక్షణమే కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం దీనికై కేంద్రంపై బలమైన ఒత్తిడి తీసుకురావాలి,
అత్యంత వెనుకబడిన బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో ఉప వర్గీకరణ చేసి రిజర్వేషన్లు కల్పించాలి,
ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.కావున వాటిని రద్దు చేయాలి లేదా బీసీ ఎస్సీ ఎస్టీలలోని నిరుపేద వర్గాలకు ఇందులో అవకాశం కల్పించాలి,
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి,
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించిన బడ్జెట్ ను తక్షణమే విడుదల చేయాలి. సబ్ ప్లాన్ అమలు చేయాలి
రెండు లక్షల ఉద్యోగాలభర్తిని వెంటనే ప్రారంభించాలి. ప్రవేశ పరీక్షలకు సంబంధించి జీవో 29 రద్దుచేసి, పాత జీవో 55 పునరుద్ధరించాలి
బీసీలకు ఎస్సీ, ఎస్టీల వలె రక్షణ చట్టాలు కల్పించాలి
జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 56% రిజర్వేషన్లు అమలు చేయాలి మేమేంటో మాకు అంత వాటా అమలుపరచాలి
రాజ్యాంగ సవరణ చేసి న్యాయస్థానాలు సృష్టించిన 50 శాతం సీలింగ్ ను ఎత్తివేయాలి
ఉద్యోగాల ప్రమోషన్లలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి
హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించాలి
నామినేటెడ్ కార్పొరేషన్ పదవులలో సామాజిక న్యాయం పాటించి బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నియమించాలి.
పై డిమాండ్స్ ను నెరవేర్చుటకై ఈనెల 24న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాలో భూపాలపల్లి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయగలరు.
ఈ కార్యక్రమంలో బొజ్జపల్లి మహర్షి,రేణుకుంట్ల బీసీ జాక్ కోఆర్డినేటర్ శేఖర్ నాని గట్టు రవి దేవేందర్ మహేష్, మల్లయ్య,మంత్రి రాకేష్,బోయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
