రాళ్ళగూడెంలో మడకం మహేష్ అధ్యక్షతన జరిగిన సమావేశం
భద్రాచలం నేటిదాత్రి
గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ కరపత్రాలను విడుదల చేస్తూ ఆదిమ జాతులకు మరింత చైతన్యం సంఘటితంగా రాణించేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులను తీర్చిదిద్దేందుకు గోండ్వానా భూభాగంలో భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి ఆదిమ జాతుల విద్యార్థులను న్యాయ శాస్త్రంలో ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము భద్రాచలం బిఈడి కళాశాల తరహాలో ఒక న్యాయ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ఆదివాసి విద్యార్థులు సుదూర ప్రాంతాలైన హైదరాబాదు వరంగల్ వంటి నగరాలలో చదువు కోటానికి పోకుండా ఈ ప్రాంతంలో న్యాయ కళాశాల ఉంటే చదవటానికి ఆస్కారం ఉంటుందని అన్నారు జూన్ మొదటి వారంలో చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను విద్యావంతులు మేధావులు ప్రజాసంఘాలు విద్యార్థులు మద్దతు పలకాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కాటేబోయిన సంతోష్ కొప్పుల రమేష్ కనితి కన్నారావు మడకం కృష్ణార్జునరావ్, చింతకాయల సుధాకర్, కొప్పుల ఉదయ్, కుమార్ కొర్ష రాజేష్ ,మడి మధు ,మడి మురళి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు