BC JAC Calls for Chalo Indira Park Protest
ఛలో ఇందిరా పార్క్ ధర్నా విజయవంతం చేయాలి
బీసీ జేఏసీ జిల్లా చేర్మెన్ పైడిపెల్లి రమేష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీసీ జేఏసీ నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ జేఏసీ భూపాలపల్లి జిల్లా కమిటి ఛైర్మెన్ పైడిపెల్లి రమేష్ హాజరై అనంతరం
మాట్లాడుతు జస్టిస్ ఈశ్వరయ్య, ఐఏఎస్ చిరంజీవులు, డా. విశారాధన్ మహారాజ్ నాయకత్వం లో జరుగుతున్న బీసీ రిజర్వేషన్ 42% బిల్లు ను 9షెడ్యూల్డ్ లో చేర్చాలని డిమాండ్ తో ఇందిరా పార్క్ లో అక్టోబర్ 24న ధర్నా విజయవంతం చేయాలి జిల్లాలో ఉన్న బీసీ సంఘాల నాయకులకు,వివిధ కుల సంఘాల నాయకులు ఎస్టీ, యస్సి సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేసారు
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ ఛైర్మెన్ గట్ల రాజన్న, కన్వీనర్లు జోగు బుచ్చన్న, కో కన్వీనర్లు బర్ల గట్టయ్య,క్యాతరాజు సాంబమూర్తి, అమృత అశోక్, కో ఆర్డినేటర్ శేఖర్ నాని కమిటి సభ్యులు తాటికంటి రవి కుమార్, కొండపర్తి ఇస్తారీ, యాదండ్ల గటయ్య, యూత్ నాయకులు పూర్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
