BC-SC-ST Unity Dharna on Oct 24
ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24న హైదరాబాదులో జరగబోయే ధర్నా కార్యక్రమం గురించి బీసీ జేఏసీ కన్వీనర్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుటకు సిరికొండ మధుసూదన చారి జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ బాలరాజు గౌడ్ అన్ని బీసీ సంఘాల మద్దతుతో ఇందిరా పార్కు వద్ద హైదరాబాదులో నిర్వహిస్తున్న భారీ ధర్నా కార్యక్రమానికి బీసీ లందరూ ఐక్యంగా పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో భవిష్యత్తు ప్రణాళిక మహా పోరాటాన్ని ప్రకటించనున్నందున బిసి, ఎస్సీ ఎస్టీ లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టేకుమట్ల ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకినపల్లి శ్యామ్ , వర్తక సంఘం అధ్యక్షులు బొడ్డు సదానందం, ముదిరాజ్ మండల నాయకులు ఎలవేణి రాజేందర్ ,పద్మశాలి మండల అధ్యక్షుడు మాచర్ల మహేందర్, నాయిని బ్రహ్మ మండలం అధ్యక్షుడు మేడిపల్లి నరేష్ ,విశ్వకర్మ నాయకులు ఆపోజి దేవేందర్ నాయకులు,పద్మశాలి మండల నాయకులు బండిరాజేంద్రప్రసాద్, మైనారిటీ మండల నాయకులు ఎండి కాజా, యాదవ సంఘం నాయకులు రాజయ్య,రజక సంఘం ఉపాధ్యక్షుడు నిమ్మల స్వామి, మండల నాయకులు వారాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
