చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ
మహాదేవపూర్ నవంబర్ 12 నేటి ధాత్రి *
ఈ రోజు మహాదేవపూర్ మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు మండల కన్వీనర్ ప్రభాకర్ అధ్యర్యం లోనవంబర్ 26 న డిల్లీలో జరిగే రాజ్యాంగ హక్కుల సాధన సభ యొక్క చలో డిల్లి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన జాతీయ మాల మహానాడు మంథని నియోజక వర్గ ఇన్చార్జ్ కందుల రాజన్నమాట్లాడుతూ నవంబర్ 26 న రాజ్యాంగం అమలైన రోజును పురస్కరించుకొని జాతీయ మాల మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే రాజ్యాంగ సభ హక్కుల గురించి సభ యొక్క ఉద్దేశమును రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాపాడుకోవాలని అదేవిధంగా వర్గీకరణ సవరించాలని జీవో 99 ద్వారా చేసిన రోస్టర్ పాయింట్ సవరించి 20వ రోస్టర్ లో మాలలకు మాలోపు కులాలకు రెండు పాయింట్లు కేటాయించాలని దీనికి అన్ని పార్టీలు సహకరించాలని అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ అయినా మాలలకు అన్యాయం చేసిన మాలను చిన్న ఆ పార్టీలకు అందరం కలిసి పార్టీలకతీతంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని జాతీయ మాలమాహానాడు మంథని నియోజకవర్గ కమిటీ తరఫున హెచ్చరించడం జరిగింది ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మాల అంబేద్కర్ అభిమానులు రాజ్యాంగ అభిమానులు రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందే ప్రతి కార్యకర్త పార్టీలకతీతంగా ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ మండల సీనియర్ నాయకులు బుర్రి శివరాజు మరియు మండల కో కన్వీనర్ మంచినీళ్ళ రాజబాపు మరియు మండల సభ్యులు బోగె దేవరాజు, గుండు నాగరాజు, సలాం వెంకటరాజు, కొత్తూరు రవి, లేళ్ల చంద్రయ్య , అమురాజీ నాగరాజు,భూపాల్ పల్లి జిల్లా యువత అధ్యక్షులు సకినాల ప్రశాంత్ మహాదేవపూర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..
