రెండు రాష్ట్రాలకు అడ్డాగా మారిన జహీరాబాద్

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T132142.597.wav?_=1

 

రెండు రాష్ట్రాలకు అడ్డాగా మారిన జహీరాబాద్

◆:- రెండు రాష్ట్రాలకు అడ్డాగా మారిన ఖేడ్

◆:- పంట పొలాల్లోనే తయారీ..

◆:- నిబంధనలు ఉల్లంఘించి బరితెగించిన వ్యాపారులు

◆:- సమాచారం తెలిపినా కన్నెత్తి చూడని అధికారులు

◆:- పట్టించుకోని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు

జహీరాబాద్ నియోజకవర్గం ఇటుక బట్టీలకు దందాగా మారింది. ఆంధ్ర ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీలను తయారు చేస్తున్నారు. సంబంధిత పంచాయతీకి రావలసిన ఆదాయానికి వ్యాపారులు గండి కొడుతున్నారు. అంతేకాకుండా నిబంధనలు కాలరాస్తూ.. కొనుగోళ్లు చేస్తూ రూ.కోట్లకు దండుకుంటున్నా రు. ఈ వ్యవహారంపై వ్యవహారం సంబంధిత శాఖ అధికారుల దృష్టి సారించకపోవడం తో దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఇంతా దందా సాగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : రెండు రాష్ట్రాలకు అడ్డాగా మారిన ఖేడ్ ఇటుక బట్టీల దందా కొనసాగిస్తు
న్నారు. సంత్ పూర్ నుంచి వచ్చి మూడు సంవ త్సరాల నుంచి ఇటుక బట్టులను తయారు చేస్తూ… ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీలను తయారు చేస్తున్నారు. రూ. కోట్లల్లో దందా జరు గుతుంది. కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే కొట్టిన సంఘటనలను అనేకం ఉన్నాయి. పని చేయిం చుకున్న తర్వాత పోయేముందు కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసులు నమోదైన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ.. ఎలాంటి నిబంధనలు పాటించని అక్రమార్కులకు ఎంకరేజ్ చేస్తున్నా రు. ఇటుక బట్టీల వ్యాపారులతో ప్రత్యేక ఒ ప్పందం పెట్టుకుంటున్నారు. సంబంధిత పంచా యతీకి రావలసిన ఆదాయానికి గండి కొడుతు న్నారు. అంతేకాకుండా నిబంధనలు కాలరాస్తూ కొనుగోళ్లు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అక్రమాలకు పుట్టగా ఇటుక బట్టీలు తయారవు తున్నాయి. ఇటుక బట్టీ ఏర్పాటు చేయాలంటే ముందుగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ తో పాటు, మైనింగ్, రెవెన్యూ, పరిశ్రమ శాఖ. కాలుష్య, కార్మిక శాఖ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, నియంత్రణ మండలి రవాణా శాఖ అనుమతులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అవేమి కనిపించవు. ఈ వ్యవహా రంపై సం బంధిత శాఖ అధి కారుల దృష్టి సారించక పోవడంతో వ్యాపారులు దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగు తుంది. ఇటుక బట్టీల సీజన్ లో అధికారులకు సైతం నెల నెలకు మా మూలు అందుతున్నాయన్న ఆరోప ణలు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామా ల్లోని ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు దందా కొనసాగుతున్నప్పటికీ ఏమీ బాధ్యత లేని అన్నట్లు ఆయా విభా గాల అధికారులు వ్యవహ రిస్తున్నారు. ఇటుక బట్టీల వ్యాపా రం యథేచ్చగా సాగుతున్న అధికారులు అటు వైపు కన్నెత్తి చూడ కపోవడంతో పలు అనుమానా లు తవిస్తోంది. జిల్లాలోనే జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటుక బట్టీల అక్రమ దందాపై జిల్లా కలెక్టర్, ఉన్నతా అధికారులు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పంట పొలాల్లో తయారీ..

ధనార్జననే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు పంటలు పండించాల్సిన భూముల్లో ఇటుక బట్టిలను బిజినెస్ సాగిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శివారులో ఆంధ్రకు చెందిన జహీరాబాద్ లో ఉంటూ పరిచయం పెంచుకుంటూ మొగుడంపల్లి జహీరాబాద్ న్యాల్కల్ మండల శివారులోని రూట్లో భూమిని లీజుకు తీసుకొని పెద్ద ఎత్తున ఇటుక బట్టీలను తయారు చేసి హైదరాబాద్, కర్ణాటక మహారాష్ట్ర తరలిస్తున్నారు. అదేవిధంగా జహీరాబాద్ మండలం , శాఖాపూర్ రోడ్డు చిన్న హైదరాబాద్ శాఖాపూర్ కొత్తూరు ఇప్పేపల్లి గ్రామలో ఇటుక బట్టీ ఏర్పాటు చేశారు.

50 కు పైగానే ఇటుక బట్టీలు

నియోజకవర్గంలో సుమారు 50 పైగా ఇటుక బట్టీలు అక్రమంగా కొనసాగిస్తున్నట్లు సమా చారం. వీటిలో అన్ని ఇటుక బట్టీలు అనుమ తులు లేకుండానే కొనసాగిస్తుండడంతో ప్రభు త్వం ఆదాయం కోల్పోతుంది. లక్ష ఇటుకలు తయారు చేస్తున్న బట్టీ నిర్వహణకు గనుల శాఖ అనుమతి కోసం రూ.16 వేలు చెల్లించాలి. మట్టికి ఒక క్యూబిక్ మీటర్ కు సీనరేజీతో కలు పుకొని రూ. 40చొప్పున కట్టివ్వాలి. అవేమీ చెల్లించకుండానే వందల ట్రిప్పుల మట్టిని తవ్వు కుపోవుతున్నారు. పొగ వస్తున్న కాలుష్యం ని యంత్రణ బండలి అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టిని తరలిస్తున్న రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version