గణనాధులను దర్శించుకున్న చల్మెడ

రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో
అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న
గణనాథుని నవరాత్రి ఉత్సవాలల్లో
భాగంగా సోమవారం వేములవాడ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు స్థానిక నాయకులతో కలిసి ఎస్ ఆర్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో, మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి వీధిలో, శ్రీ సర్వేజనా గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇందిర చౌక్ లో గల గణనాథునికి ప్రత్యేక పూజలు
నిర్వహించి తీర్థ ప్రసాదాలు
స్వీకరించారు. వివిధ గణనాథుని మండపాల కమిటీ సభ్యులు వార్డు లోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చవితి నవరాత్రి
ఉత్సవాలల్లో బాగంగా గణేష్ మండపం దగ్గర నిర్వహించిన
అన్నదాన కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా హాజరై గణనాధునికి ప్రత్యేక పూజలు
నిర్వహించి అనంతరం స్థానిక నాయకులతో కార్యకర్తలతో కలిసి భోజనాలను వడ్డించి
బోజనాలు చేశారు. అనంతరం లక్ష్మీనరసింహారావు గారిని మండపాల నిర్వాహకులు శాలువల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణనాధులు ఆశీస్సులు రుద్రంగి ప్రజలపై ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు రైతులు అందరూ బాగుండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట జడ్పిటిసి మీనయ్య, ఎంపీపీ స్వరూప రాణి, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, నాయకులు మంచే రాజేశం, కేసి రెడ్డి నర్సిరెడ్డి, మారిశెట్టి ఆనందం ,ఉపులుటి గణేష్, గెంటే ప్రశాంత్, బండారి నరసయ్య, కొమరే శంకర్, దేవేందర్, గంగ మహేష్, దాసరి గంగరాజం, మరియు స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!