పరకాల నేటిధాత్రి
ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పరకాల నియోజకవర్గ నినాదం దినపత్రిక రిపోర్టర్ గడ్డం బాలరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో చెయ్యికి తీవ్ర గాయం కావడంతో పరకాల మండలం నాగారం గ్రామం వారి స్వగృహం నందు శనివారం పరకాల శాసనసభ్యులు బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. అనంతరం రోడ్డు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. జర్నలిస్టులకు అండగా ఉంటానని నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి పెద్దన్నగా అండగా నిలుస్తానని ఎన్నికల విధి నిర్వహణలో జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబాన్ని ఆలోచించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మండల వైస్ ఎంపీపీ చింతి రెడ్డి మధుసూదన్ రెడ్డి మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
జర్నలిస్టును పరామర్శించిన చల్లా
