
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో పరకాల నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.పర్యటనలో భాగంగా ఇటీవలే గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన మాడ సౌమ్యశ్రీ, బండారి రాజమ్మ,కానుగుల సరోజన కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.అనంతరం మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి,పరకాల వైస్ ఎంపిపి,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి,మద్దెల బాబు,టిఆర్ఎస్ యూత్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.