
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కాంగ్రెస్ పార్టీ కార్య సమితి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి భేటీఅయ్యారు. పాలమూరు జిల్లాలో అభివృద్ధిపై ఇరువురు సుదీర్ఘ చర్చ చేసారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు, అనుమతులపై చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రత్యేకించి జిల్లాలో సాగునీరు, ఉద్యోగ ఉపాధి కల్పన, మెరుగైన విద్య ఆరోగ్య వసతుల కల్పనపై, రైల్వే లైన్లు, రోడ్ల నిర్మాణం మరియు పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.