
నడి కూడ,నేటి ధాత్రి:
వరంగల్‌లో వంద శాతం విజయం బీఆర్ఎస్దేనని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నడికూడ మండలం వరికోల్,పులిగిల్ల,రాయపర్తి,నర్సక్కపల్లి,నడికూడ గ్రామాలలో బిఆర్ఎస్ కార్యకర్తలతో గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ లో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.ఇటు కాంగ్రెస్‌కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని అన్నారు.
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో అధికార కాంగ్రెస్‌పై విఫలమైందని అన్నారు. ఇప్పటికే ఆ పార్టీపై ప్రజాగ్రహం పెరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. వరంగల్‌లో చివరి క్షణంలో కడియం శ్రీహరి కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు.
అసెంబ్లి ఎన్నికల సందర్భంగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని వెల్లడించారు. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో చెప్పుకోవడానికి బీజేపీకి ఎజెండానే లేదని, అందుకే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టెక్కాలని చూస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నడి కూడ గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి,నాయకులు నందికొండ గణపతిరెడ్డి, నందికొండ జైపాల్ రెడ్డి,భీముడి నాగిరెడ్డి,తిప్పర్తి సాంబశివ రెడ్డి, నల్లెల లింగమూర్తి, గురిజపల్లి ప్రకాష్ రావు,మేడిపల్లి శోభన్, సుదాటి వెంకటేశ్వర్ రావు, చందా కుమారస్వామి,మాజీ ఎంపిటిసిలు,సర్పంచులు,యూత్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.