పరకాల నేటిధాత్రి
పరకాల బస్టాండ్ ఆవరణలో పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణ ప్రజలకు మరియు ప్రయాణికులకు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని దాహాన్ని తీర్చాలని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.దీనిని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ ప్రారంభించారు.ప్రజలకు ఎండాకాలంలో ఎండలు మండుతున్నాయని వాటి నుంచి రక్షణ చర్యలలో భాగంగా ఎక్కువగా నీరు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు లేకుంటే ఎండ వేడి తలిగి నీరసించిపోతాము కావున పోలీసు వారు ఏర్పాటుచేసిన చలివేంద్రం అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సీఐ పరకాల రవిరాజు ని ఏసిపి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్ దేవేందర్,రవీందర్,బస్టాండ్ సిబ్బంది,ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు