ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం…చలివేంద్ర ప్రారంభం
1983-84 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో
ఇల్లందకుంట:నేటి ధాత్రి
.. అపర భద్రాద్రిగా పేరుందిన ఇల్లంద కుంట శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం లో నిర్వహించే రథోత్సవాలు,నాగబెల్లి ఉత్సవాల కోసం జమ్మికుంట జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల పదో తరగతి 1983- 84 బ్యాచ్ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జెడ్పి మాజీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, దేవాలయ కమిటీ చైర్మన్ ఇంగ్లె రామారావు ప్రారంభించారు. జెడ్పి మాజీ చైర్పర్సన్ కనుమల విజయ మాట్లాడుతూ 1983- 84 10వ తరగతి జెడ్పి హెచ్ఎస్ బాలుర పాఠశాల జమ్మికుంట బాల్యమిత్రులు కరోనా సమయం నుంచి సామాజిక సేవలో పాల్గొం టున్నారని గత ఐదు సంవత్సరాలుగా ఇల్లంతకుంట సీతారాముల బ్రహ్మోత్సవాలకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సేవలు చేయడం అభినందనీయమన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ రామారావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు నాలుగు రోజులపాటు భక్తులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్న బాల్య మిత్రుల సేవా సమితి చేయూ తను అభినందించారు. బాల్య మిత్రుల సేవా సమితి అధ్యక్షులు మొకిరాల సంపత్ రావు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం పదవ తరగతి చదువుకున్న మిత్రులమంతా బాల్య మిత్రుల సేవాసమితి ఏర్పాటు చేసుకొని గత ఐదు సంవత్సరాలుగా సామాజిక సేవలో పాల్గొంటున్నామని ఈ క్రమంలో ఇల్లంద కుంట రామాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేలాది భక్తులకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. బాల్య మిత్రుల చేతతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, తమకు మొదటి నుంచి సహకరిస్తున్న జెడ్పి మాజీ చైర్పర్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిర్వహిస్తున్న చలివేదిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవస్థాన ఈవో కే సుధాకర్, ఆలయ కమిటీ డైరెక్టర్లు బాల్య మిత్రుల సేవాసమితి అధ్యక్షులు మొకిరాల సంపత్ రావు,o ప్రధాన కార్యదర్శి మంద వెంక రెడ్డి కోశాధికారి డి. సంపత్, బాల్యమితుల సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం.
