రైతు కన్నుల్లో సంతోషం రుణపడి ఉంటాం శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండిపడగా బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలవగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే దేవాదుల వెంకటేశ్వర్లుకు ఫోన్ లో సంప్రదించి వెంటనే మరమ్మతు పనులు చేయాలని రైతుల పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం వెంకటేశ్వర్లు, డిఈ గిరి, ఏఈ అమృత్ లు కాల్వకు పడిన గండి ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించారు. బుధవారం ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ గండి పూడ్చివేత మరమ్మతు పనులు చేపట్టారు. సర్పంచ్ గోలి మాధురి మహేందర్ రెడ్డి, ఎంపిటిసి మేకల శ్రీనివాస్, ఉప సర్పంచ్ అట్ల తిరుపతి, వార్డు సభ్యులు గుర్రం సుధాకర్, రైతులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.