చెన్నూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ వేసిన చాకినారపు కిరణ్ కుమార్

చెన్నూర్ స్తానికుడిగా పోటీ చేస్తున్న అవకాశం ఇవ్వండి

నియోజకవర్గ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారమే నా లక్ష్యం.

విద్య,వైద్యం లో చెన్నూర్ లో ఎక్కడ అభివృద్ధి జరిగింది.?

చెన్నూర్ నియోజకవర్గం నుంచి చెన్నూర్ పట్టణ స్థానికుడు యువకుడు విద్యావంతుడు చకినారపు కిరణ్ కుమార్ ఈ రోజు నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా మీడియా సమావేశం లో మాట్లాడారు.సామాన్య యువకుడైన నేను ఎం ఎల్ ఏ గా నిలబడే అవకాశం వచ్చింది అంటే అది అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కు మరియు రాజకీయ రిజర్వేషన్ వల్లే సాధ్యం అయింది అని ఆయనకు పాదాభివందనం తెలియజేశారు అలాగే మా తండ్రి యొక్క ప్రోత్సాహం,మిత్రుల ప్రోత్సాహం తోనే ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు చెప్పారు.నియోజక వర్గం లో అభివృద్ధి జరిగింది అంటున్నారు విద్య వైద్యం లో ఎం అభివృద్ధి జరిగింది.విద్య విషయం లో చెన్నూర్ లో డిగ్రీ అయ్యాక పిజి చేయడానికి ఇక్కడ పిజి కాలేజ్ లేదు,స్కూల్ ,ఇంటర్ దశలో చదువు మానేసిన పట్టణ విద్యార్థులకు మళ్ళీ చదువుకోడానికి దూర విద్య కేంద్రం లేదు,వృత్తి విద్య కోర్స్ లు ఐ ఐ,అగ్రికల్చర్ డిప్లొమా,ఎలక్ట్రికల్ ప్లంబర్ లాంటి కోర్సు లు చేయడానికి అవకాశం లేదు అన్నారు.యువకులకు ఉపయోగపడే సాంకేతిక నైపుణ్యం అయిన పథకాలు పెట్టలేదు,గతం లో మాదిరిగా యువకిరణాలు అనే ప్రోగ్రాం లో యువతకు స్పోకెన్ ఇంగ్లీష్,కంప్యూటర్ శిక్షణ,టైపింగ్ లాంటి నైపుణ్యం ఉన్న సెంటర్ నీ ఏర్పాటు చేశారా అన్నారు.మున్సిపాలిటీలో పని చేసే సపయి వాళ్ళు నాళాలు,మురుగు నీటి కాలువలు శుభ్రం చేస్తారు వాళ్ళకి నెలకు 7 వేయిల రూపాయల జీతం అది కూడా 3 లేదా 4 నెలలకు ఒకసారి ఇస్తారు , వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తున్నారు వీళ్ళని పర్మినెంట్ ఉద్యోగస్తులు గా ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు.
ప్రభుత్వ దవాఖానలో వైద్య విధానం ఎప్పటికీ మారుతుంది?
వైద్య పరంగా ఆధునిక ఆసుపత్రి ఉంది గానీ ఆధునిక వసతులు ఎవి అని ప్రశ్నించారు. అదే డాక్టర్లు అదే వైద్యం అవే మందులు ప్రభుత్వ దవాఖానలో ఎప్పటికీ మార్పు వస్తుంది అని ప్రశ్నించారు ఎంతటి రోగం వచ్చిన గుకోజ్ ఒక్కటి పెడతారు కనీసం స్టెతస్కోప్ గానీ బి పి మిషన్ గానీ వదిన దాఖలాలు చాలా అరుదు అన్నారు.ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్స్ రే లేదు,పాతలజి లేదు,డెంటిస్ట్,లాంటి ప్రత్యేక వైద్యులు లేరు.ఆసుపత్రిలో రోగులకు మందులు ఇచ్చే పద్దతి ఎప్పటికీ మారుతుంది.
రేషన్ కార్డుల జారీ ఎప్పుడో ?
పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ రేషన్ కార్డులు మంజూరు చేయని ఘనత ఈ ప్రభుత్వానిది.రేషన్ కార్డ్ ఉంటే నే గృహలక్ష్మి పథకం కానీ ఆ రేషన్ కార్డులు మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు.సైట్ లో ఆడింగ్ ఆప్షన్ లేదు గానీ డిలీట్ ఆప్షన్ మాత్రం కచ్చితంగా ఉంటుంది అన్నారు.
ఇప్పటికీ

చెప్పుకున్న అభివృద్ధిలో ఎంటి ఇంటికి మంచినీరు ఇస్తున్నారా?
ఇప్పటికీ చెన్నూర్ పట్టణం లో తాగునీటికి కట కటే,త్రాగు నీరు తెచ్చుకోవాలి అంటే పోచమ్మ టెంపుల్ దగ్గరకు లేదో టాంక్ దగ్గరకి వెళ్లి తీసుకువచ్చి త్రాగే పరిస్థితి.రోజుకు 40 రూపాయల చొప్పున మినరల్ వాటర్ కొనుక్కుని త్రాగే పరిస్థితి ఇక్కడ ఉంది అన్నారు.
అందుబాటులో ఉన్న ఇసుక అయిన అందని ద్రా క్షే.?
పట్టణానికి అనుకొని ఉన్న గోదావరి ఇసుక మాత్రం పట్టణ వాసులకు అందుబాటులో లేదు ఇక్కడినుంచి సుదూర ప్రాంతాలకు ఇసుక తరలింపు జరుగుతుంది కానీ చెన్నూర్ ప్రజలకు గోదావరి ఇసుకామత్రం బ్లాక్ లోనే కొనుక్కునే పరిస్థితి ఇప్పటికీ ఉంది అన్నారు.ప్రాథమిక సమస్యలు ఇక్కడి ప్రాంతం వాడికే అర్థం అవుతాయి ఈ గ్రౌండ్ లెవెల్ ఉన్న సమస్యల ను నేను పరిష్కారం చేస్తాను ఒక్క అవకాశం స్తానికుడిగా నాకు ఇవ్వండి నేను మీకు అందుబాటులో ఉండి సేవచేసుకుంట ను అని నియోజక ప్రజలను అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!