బిఆర్ఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి :

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.తెలంగాణ సమాజానికి ఐలమ్మ అందించిన సామాజిక ఉద్యమ స్పూర్తిని స్మరించుకొని నేటి,భవిష్యత్ తరాలకు నిత్యస్ఫూర్తి దాయకంగా నిలిచిందని మున్సిపల్ చైర్మన్ గుంటి రజినికిషన్,పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్ అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని అమలు చేసిందని గుర్తుకు చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపిపి నల్ల మనోహర్ రెడ్డి,డివిజన్ నాయకులు, డాక్టర్ విద్యా సాగర్ రెడ్డి,ఎన్నారై సెల్,యూత్ డివిజన్ కన్వీనర్ శానబోయిన రాజకుమార్ బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, జాగృతి జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశ్,కౌన్సిలర్లు ఎండి పాషా,రామ సాయం శ్రీదేవి సుధాకర్ రెడ్డి, నాయకులు బండి రమేష్ ,మండల శ్రీనివాస్,వాసం కరుణ,మద్దెల సాంబయ్య,సంపంగి సాలయ్య,పైస ప్రవీణ్,నాయకులు లక్ష్మీనారాయణ శివరాత్రి స్వామి,మడికొండ నరేందర్, ఎండి ఇర్ఫాన్,ఆబోతు రాజు,బోలె పాషా,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!