నర్సంపేట,నేటిధాత్రి :
భూమి కోసం,భూక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్బంగా భారతీయ రజక సంఘం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆమె విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా కార్యక్రమ ముఖ్య అతిథిలుగా హాజరైనటువంటి డాక్టర్ పి గోపాల్, బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, మరియు బిజెఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తడిగొప్పుల మల్లేష్ మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాట విల్లంబై, అలుపెరుగని ఆయుధమై కదిలిన ధీరవనిత ఐలమ్మ అని అన్నారు.దొరల పెత్తందారుల గుండెలపై సింహ స్వప్నమై,గర్జించిన ఐలమ్మ మహిళా లోకానికి చైతన్య స్ఫూర్తి అని పేర్కొన్నారు.నిరంతరం మార్పుకోసం పనిచేసి తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి ఆదర్శమైన వ్యక్తిగా ఉన్నతమైన ఆశయాల కోసం ఉద్యమిస్తూ ఎంతోమందికి అండగా నిలిచిందని వారు అభివర్ణించారు.ప్రజలను రైతులను ,సంఘటిత పరచి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుల నాయకత్వ అండతో కదులుతున్న సందర్భంలో, దొరల అహంకార అరాచకాలను అడ్డుకొని విముక్తి కలిగించాలని సాయుధ పోరాటానికి చాకలి ఐలమ్మ నడుము కట్టి ముందు వరుసలో నడిచిన వీరనారి అమే అని అన్నారు.
భవిష్యత్ తరాలకు నిత్య స్ఫూర్తి దాయకంగా నిలిచిన విప్లవ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట భారతీయ రజక సంఘం అధ్యక్షులు కొల్లూరు లక్ష్మీనారాయణ , పుట్టపాక రవి ,చౌడారపు మధు, సాంబరాతి మల్లేశం , తడిగొప్పుల ప్రవీణ్, మామిడాల నరసయ్య, రాయరాకుల శ్రీను, చింతాం విజయ రాణి, కందిపల్లి శంకర్ , మేకల రాజకుమార్ , జెట్టబోయిన రాజు ,పొదిల రామచందర్, దిలీప్, మామిడాల బిక్షపతి ,మరియు నర్సంపేట బారాకులం అధ్యక్షులు ఐలోని శ్రీనివాస్, గుడికందుల సదానందం, కొల్లూరి శ్రీహరి, కొల్లూరి మధుకర్ ,తడిగొప్పుల రణధీష్ ,నెల్లుట్ల శివ, ప్రవీణ్, నరేష్ , రాజు తదితరులు పాల్గొన్నారు.