గంగాధర నేటిధాత్రి :
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గంగాధర లో చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రిన్సిపాల్ ఏ. సత్యనా రాంజనేయ మాట్లాడుతూ సాకలి ఐలమ్మ గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, తెలంగాణ ఖ్యాతిని తెలంగాణ పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేసిన వీర మహిళా చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
అనంతరం ఎన్ఎస్ పి.ఓ.(NSS P.O)
ఎల్. సురేష్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం పేదల విముక్తి కోసం పోరాటం సలిపిన మహా వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు అనేక మంది స్త్రీలను మేల్కొల్పి దున్నేవారికి భూమి దక్కాలని, సమాజంలో అసమాన తలను తొలగించాలని తన జీవితకాలం ఉద్యమం కొనసాగించారు. ఆమె అందించిన పూర్తి సహకారం నేటి మహిళా లోకానికి ఎంతగానో తోడ్పడుతుందని, చాకలి ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు నడవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.