
Chakali Ailamma Jayanti Celebrated in Palakurthi
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
పాలకుర్తి నేటిధాత్రి
భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పాలకుర్తి తెగువ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పుకణిక, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పాలకుర్తి మార్కెట్ చైర్పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, పాలకుర్తి బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కారుపోతుల శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జలగం కుమార్, పాలకుర్తి గ్రామ అధ్యక్షులు కమ్మగాని నాగన్న, మాజీ సర్పంచ్ పోగు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు లావుడియా భాస్కర్ నాయక్, వి ఆర్ ఫౌండేషన్ మోలుగురి యాకన్న పన్నీర్ వెంకన్న, మాజీ వార్డ్ నెంబర్ పెనుగొండ రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారగని ఎల్లయ్య, యువ నాయకులు గడ్డం బాబు, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.