
Tribute to Veerangana Chakali Ilamma at Ramagundam Police
మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక
పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ, అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…పెత్తందార్ల దురాగతాలను,ఆనాటి నిరంకుశ రజాకార్లకు,దేశ్ ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు.మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి ప్రతిక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏ ఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ లు భీమేష్,ఆర్ఐ లు దామోదర్,శ్రీనివాస్, వామన మూర్తి,సీపీఓ సిబ్బంది,వివిధ వింగ్స్ సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.