
Tribute to Veerangana Chakali Ilamma at Shaimpet
తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక చాకలి ఐలమ్మ
ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధీరత్వానికి తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు. భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయం అని వెల్లడించారు. పెత్తందార్ల దురాగతలను ఆనాటి నిరంకుశ రజాకర్లను కు వ్యతిరేకంగా మొక్క పోయిన ధైర్యంగా ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ చిందం రవి మార్కండేయ దుబాసి కృష్ణమూర్తి,,వలి హైదర్ కట్టయ్య,రాజు, చిరంజీవి, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు, చాకలి కులస్తులు అధిక మొత్తంలో పాల్గొన్నారు