లక్ష్మి గూడా రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు….

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి,:-

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ శివాజీ చౌక్ వద్ద లక్ష్మి గుడా రజక సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీరనారి చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందెందుకు సాగుతున్న పోరు చాకలి ఐలమ్మ రాకతో భూమికోసం భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చిందని, తెలంగాణ సాయుధ పోరాటానికి దిశా నిర్దేశం కల్పించి సాయుధ పోరాటాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. ప్రతి సంవత్సరం చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఐదవ తరగతి తెలుగు వాచకంలో ఐలమ్మ పాఠం పొందుపరచడం హర్షనీయమన్నారు. తమ హక్కుల కోసం కొట్లాడే వారికి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని, తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీ గుడా రజక సంఘం పాలకవర్గం సభ్యులు బాలయ్య, రాములు, వేణుగోపాల్, మహేందర్, మహేష్, మల్లేష్, సురేష్, రాజు, మల్లేష్, రమేష్, విష్ణు, జంగయ్య, సాయి, అనిల్, రాఘవేందర్, వెంకటేష్, జగదీష్ తో పాటు మైలర్ దేవ్ పల్లి డివిజన్ అధ్యకుడు ప్రేమ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గుమ్మడి కుమార్, యువజన విభాగం నాయకుడు రఘు యాదవ్,డి రమేష్, పలువు నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *