కొమ్మాల జాతర ఏర్పాట్ల పనులు పరిశీలించిన సిఎఫ్ఓ ఆర్.సునీత
కొమ్మాల లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్.
జాతర ఏర్పాట్ల పనులు పరిశీలన.
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట నేటిధాత్రి:
నేటి నుండి ప్రారంభం కానున్న కొమ్మాల లక్సినరసింహస్వామి జాతర ఉత్సవాల నేపథ్యంలో జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
సిఎఫ్ఓ కొమ్మాల పండుగా ముఖ్య కార్యనిర్వహణ అధికారిని ఆర్ సునీత
గురువారం అందుకు సంబంధించిన పనులకు పరిశీలించారు.ముందుగా కొమ్మాల లక్ష్మి నరసింహస్వామిని దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావుతో కలిసి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు రామాచర్యులు,విష్ణు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావును ఆదేశించారు.కాగా జాతర పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు నిర్వహణ పట్ల సమీక్షా చేయనున్నట్లు
సిఎఫ్ఓ ఆర్ సునీత తెలిపారు.

జాతరలో ఏర్పాట్లు పూర్తి…ఈ.ఓ నాగేశ్వర్ రావు..
*నేటి నుండి ఈ నెల 20 వరకు జాతర నిర్వహణ ఉంటుందని అలాగే వచ్చే నెల మొదటివారం వరకు కొనసాగే అవకాశం ఉందని కొమ్మాల లక్ష్మినరసింహస్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు.వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జాతరలో భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.దేవాలయ పరిసర ప్రాంతాలలో అదనంగా విద్యుత్ లైట్ల ఏర్పాట్లు పూర్తైందన్నారు.జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గీసుకొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కోసం 400 సిబ్బందితో పోలీస్ కమిషనరేట్ కేటాయించిందని ఈ.ఓ వివరించారు.

జాతరలో ఎలాంటి పారిశుధ్యం లోపించకుండా స్థానిక గ్రామ పంచాయితీ సిబ్బందితో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ నుండి 20 మంది పారిశుధ్యం కార్మికులను కేటాయించడం జరిగిందన్నారు.అలాగే
దేవాలయం పరిదిలో మండలంలోని అదనంగా గ్రామ పంచాయితీల కార్యదర్శులు ఉన్నతాధికారులు కేటాయించారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలియజేశారు.ఈ కార్యక్రమాలలో దేవాలయ మాజీ చైర్మన్,ఆలయ సేవకులు వీరాటి రవీందర్ రెడ్డి,స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్,అర్చకులు
ఫణిందర్, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.