
First Cesarean Operation Conducted at Charla CHC
చర్ల సిహెచ్ సి లో మొదలైన సిజేరియన్ ఆపరేషన్లు
జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రత్యేక కృషి
నేటిదాత్రి చర్ల
భద్రాద్రి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సదుపాయాలు బలోపేతం అవుతున్నాయి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రత్యేక కృషి డీసీహెచ్ఎస్ రవిబాబు చొరవ కలగలిపి జిల్లాలోని వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రులలో ఆశించిన స్థాయిలో సేవలు అందుతున్నాయి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘట్టం
ఆవిష్కృతమైంది గత కొన్నాళ్ళుగా ప్రాథమిక వైద్యానికే పరిమితమైనా వైద్య సదుపాయాలు నేడు స్పెషాలిటీ వైద్య సేవలను సైతం అందుబాటులోకి వచ్చింది ఎం ఎల్ ఏ చొరవతో ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అదనపు ప్రోత్సాహాలు ప్రకటించి గర్భిణి స్త్రీల ఆరోగ్య రీత్యా ఒక ప్రసూతి వైద్యురాలు ఒక పిల్లల వైద్య నిపుణుడు ఒక మత్తు వైద్యుడు ని నియమించారు ఈ నియామకంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు ప్రత్యేక చొరవ చూపి వైద్యులను పది రోజుల క్రితం నియమించారు
ఈ క్రమం లో నేడు చర్ల సి హెచ్ సి లో మొదటి సీజేరియన్ ఆపరేషన్ జరిగింది చర్ల మండలం కొత్తూరు గ్రామంకి చెందిన తన్నీరు రాజేశ్వరి మొదటి కాన్పు కోసం రాగా సుఖప్రసవం కోసం ప్రయత్నం చేసి కాన్పు చేయలేని పరిస్థితిలో తల్లి బిడ్డ క్షేమం కోసం ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి పండంటి రెండు కేజీల మగ బిడ్డకి ఊపిరిపోశారు గతంలో ప్రసూతి సేవల కోసం అరవై కిలోమీటర్ల దూరంలో భద్రాచలం వెళ్లే పరిస్థితులు ఉండేవి కానీ ఏజెన్సీ లో ని చర్ల లో సైతం ప్రసూతి సేవలను అందుబాటులో తెచ్చిన ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావు కలెక్టర్ జితేష్ పాటిల్ డిసిహెచ్ఎస్ రవిబాబు లకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయివర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు ఆసుపత్రిలో అందుతున్న స్పెషాలిటీ సేవల పట్ల చర్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ ఆపరేషన్ లో ప్రసూతి వైద్యురాలు శ్రావణి పిల్లల వైద్యులు రవి కుమార్ మత్తు వైద్యుడు శివరామకృష్ణ నర్సింగ్ ఆఫీసర్ ఝాన్సీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు