మధ్యప్రాచ్య యుద్ధం నేర్పుతున్న పాఠాలు
· వ్లాడివోస్టాక్‘చెన్నై కారిడార్ సిద్ధానికి ప్రయత్నాలు
· దేశాన్ని హైడ్రోజన్ ఇంధన హబ్‌గా మార్చేందుకు కషి
· దేశంలో ముడి చమురు నిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు
· అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో గ్యాస్ సరఫరాపై ఒప్పందాలు
· గహావసరాలకు మొదటి ప్రాధాన్యత
· ప్రాధాన్యతా క్రమంలో గ్యాస్ సరఫరా
· హార్ముజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహాలు
· మధ్యప్రాచ్యాన్ని నమ్ముకోలేమని మరోసారి వెల్లడైన సత్యం
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రస్తుతం ఇరాన్‘యుఎస్/ఇజ్రాయిల్ యుద్ధ పోకడను పరిశీలిస్తే ఇది ఇప్పట్లో ముగిసేలా లేదు.ఈ యుద్ధం కేవలం ఈ మూడు దేశాలకు మాత్రమే పరిమితం కావడంలేదు. ఎందుకంటే ప్ర పంచ ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్న ఇంధన వనరులు (ముడిచమురు) మధ్యప్రాచ్యంలో విస్తరించి వుండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా అమెరికాపై ఆగ్రహంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు పనిలో పనిగా వాటి ఆర్థిక వ్యవస్థలపై కూడా ఇరాన్ దాడులు చేస్తుం డటంతో అత్యాధునిక, ధనిక దేశాలుగా వున్న యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు తమకు సంబందంలేని యుద్ధ విధ్వంసంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ప్రపంచ దేశాలకు అవసరమయ్యే చమురులో 20శాతం రవాణా జరిగే హర్మూజ్ జలసందిని ఇరాన్ మూసివే యడంతో చమురు సరఫరాలు నిలిచి ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటం తాజా పరిణామం. మనదేశం విషయానికి వస్తే దేశీయ అవసరాల్లో 55% వరకు చమురు ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. ఇరాన్ తీసుకున్న చర్య కారణంగా మొత్తం 150 నౌకలు ఈ జలసంధి వద్ద చిక్కుకుపోగా వీటిల్లో 38 మనదేశానికి చెందినవి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్‌లు ఇరాన్ నాయకులతో మాట్లాడి అక్కడ చిక్కుకుపోయిన మన నౌకలను ఏదోవిధంగా భారత్‌కు వచ్చేలా చేయగలిగారు.
ఇక రెండో వైపు 35% దేశీయ అవసరాలు రష్యా చమురుతో తీరుతున్నాయి. ఆమెరికా విధించిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యానుంచి, భారత్, చైనాలు చమురు కొనుగోలు చేస్తున్నాయి. మన దేశానికి చెందిన వివిధ కంపెనీలు, ఆర్థిక సంస్థలకు అమెరికాతో బలమైన ఆర్థిక సంబం ధాలున్న నేపథ్యంలో వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతినకుండా రష్యానుంచి చమురు కొనుగోళ్లను ఇవి తగ్గించాయి. రెండు రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం ఇరవై రోజులైనా ముగియకపో వడంతో, భారత్ సహా ఇతర దేశాలకు మార్చి 6 నుంచి నెలరోజుల పాటు రష్యానుంచి చమురు కొనుగోళ్లు జరపడానికి అమెరికా అనుమతించడంతో, కేవలం ఒక్క వారంలోనే 33మిలియన్ బ్యారళ్ల చమురుకు మనదేశ కంపెనీలు ఆర్డర్లు జారీచేయడం విశేషం. ఇంతవరకు బాగానే వుంది. అమెరికా విధించిన గడువు ఏప్రిల్ 6తో ముగుస్తుంది. అదేవిధంగా ఇరాన్ యుద్ధం ఒక కొలిక్కి వచ్చేట్టు లేదు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా సమస్య తీరినా తర్వాత పరిస్థితేంటనేది ప్రధానంగా చర్చించాల్సిన సమస్య.
కేంద్ర ప్రభుత్వం తర్వాతి పరిస్థితిని దష్టిలో వుంచుకొని గ్యాస్, చమురు సమస్యకు పరిష్కారంగాబహుళ`విధాన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిపై ఎక్కువ ఆధారపడ కుండా ప్రత్యామ్నాయ మార్గాలు లేదా విధానాల్లో చమురు, సహజవాయువు సరఫరాలను దేశంలోకి ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడమే ఈ వ్యూహం లక్ష్యం. ఇందులో తక్షణ చ ర్యగా, వ్లాడివోస్టాక్`చెన్నై సముద్రమార్గం గుండా రష్యా చమురు, u£గ్గు, రసాయన ఎరువులు సరఫరా అయ్యేందుకు “తూర్పు సముద్ర కారిడార” (ఈఎంసీ)ని అందుబాటులోకి తీసుకువచ్చేం దుకు చర్యలను వేగవంతం చేసింది. ఇది ప్రారంభమైతే, మధ్యప్రాచ్యంలోని అస్థిర పరిస్థితుల ప్రభావం ఎంతమాత్రం లేకుండా నిరంతరాయంగా నౌకా రవాణాను జరుపవచ్చు. రెండవది యు.ఎస్. గల్ఫ్కోస్ట్ నుంచి ఏటా 2.2మిలియన్ టన్నుల అదనపు ఎల్పీజీని సేకరించడం. ఇక ఆస్ట్రేలియా 60 ఎంఎంఎస్‌సీఎండీ అదనంగా గ్యాస్‌ను మనకు అందించేందుకు హామీ ఇచ్చింది. ఇటీవల కెనడా ప్రధాని మనదేశానికి వచ్చినప్పుడు కుదిరిన ఒప్పందాల్లో, ఆ దేశంతో మనకు దీర్ఘకాల గ్యాస్ సరఫరా ఒప్పందం కూడా వుంది.
ఇక దేశీయంగా ప్రభుత్వం అత్యవసర వస్తువుల చట్టం‘1956ను, మార్చి 10నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం సహజవాయువు వినియోగానికి నాలుగు అంచెల ప్రాధాన్యతా క్రమాన్ని అమలు చేస్తున్నది. గహావసరాలు, రవాణా, ఎల్పీజీ ఉత్పత్తికి మొదటి ప్రాధాన్యత (100%). ఫెర్టిలైజర్ ప్లాంట్లకు రెండో ప్రాధాన్యత (70% పరిమితి). తయారీ, పారిశ్రామిక వినియోగదార్లకు మూడో ప్రాధాన్యత (80% పరిమితి). ఇక దేశీయ రిఫైనరీలు, విదేశాలకు శుద్ధి చేసిన పె ట్రోల్, డీజిల్‌లను ఎగుమతులను నిలుపుచేసి, దేశీయ సరఫరాలకు ప్రాధాన్యత నివ్వడానికి నిర్ణ యించాయి.
ఇక మనదేశంలోని మూడు ప్రదేశాల్లో చమురు నిల్వలను కొనసాగిస్తున్నారు. అవి వరుసగా వి శాఖపట్టణం, మంగళూరు, పాడూరు. 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులు చమురును వీటిల్లో ని ల్వ చేయవచ్చు. దీని బఫర్ సామర్థ్యం 18 రోజులు. వండుకోవడానికి ప్రత్యామ్నాయ వసతులున్న కుటుంబాలకు ఎల్పీజీ రేషనింగ్‌ను అమలు చేసే విధానంపై అధికార్లు దష్టి పెట్టారు. ఇక పెట్రో రసాయనాలనుంచి ప్రొపేన్, బ్యూటేన్ల ఉత్పతిని గరిష్టస్థాయికి పెంచడం మరో వ్యూహం. ఈ నెలలో మనదేశ ఇంధన భద్రత గణాంకాలీవిధంగా వున్నాయి. దిగుమతులపై ఆధారం 88`90% వరకు వుంది. దీనికి సంబంధించిన బఫర్ స్టాక్ విషయానికి వస్తే ముడి చమురు 17`18 రోజులకు/ 20`21 రోజులకు వీటి ఉత్పత్తులు అందుబాటులో వున్నాయి. ఇక ఎల్పీజీ 60`65% దిగుమతులపై ఆధారపడగా, 30 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. ఎలఎన్జీ 50`60శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతుండగా 10`12 రోజుల వరకు నిల్వలున్నా యి.
దీర్ఘకాలంలో ఇంధన సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది. ముఖ్యంగా శిలాజ ఇంధనాల నిల్వలను పెంచుకోవడం, క్లీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనివ్వడం ఈ వ్యూహంలో భాగం. ఇండియన్ స్ట్రాటిజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ (ఐఎస్పీఆరఎల్) ప్రస్తుత అత్యవసర క్రూడాయిల్ నిల్వలను రెట్టింపు చేయడానికి ప్రణాలికలు రూపొందిస్తోంది. ఇందుకోసం అమలు చేస్తున్న రెండోదశ ప్రణాలికలో భాగంగా ప్రస్తుతం వున్న 5.33మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని మరో 6.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అంటే దేశీయంగా చమురు నిల్వ సామర్థ్యం 11.83మిలి యన్ మెట్రిక్ టన్నులకు చేరుతుంది. ఇందుకోసం ఒడిషాలోని చండీకోల్ భూగర్భ నిల్వ కేం ద్రం లో 4ఎంఎంటీల చమురు నిల్వచేస్తారు. అదేవిధంగా కర్ణాటకలోని పాడూరు నిల్వ సామ ర్థ్యాన్ని మరో 2.5ఎంఎంటీకి పెంచనున్నారు.
చమురు నిల్వ విషయంలో మొదటి దశలో అనుసరించిన విధానాన్ని మారుస్తూ రెండో దశను అమలు చేస్తోంది. తొలిదశలో పూర్తిగా ప్రభుత్వమే ఈ నిల్వ కార్యక్రమాన్ని చేపట్టగా, రెండో దశలో ప్రైవేటు రంగానికి కూడా అవకాశం కల్పిస్తోంది. అంటే ఈ దశ పీపీపీ విధానంలో అమల వుతుంది. అంటే డిజైన్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫఓటీ) నమూనాను రూపొందిం చి విదేశీ పెట్టుబడులను ఈ రంగంలోకి ఆహ్వానించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఫేజ్`2 పూర్త యితే మరో 12రోజులకు అవసరమయ్యే క్రూడాయిల్‌ను నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో పాటు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (ఎన్జీహెచఎం) అమలును ప్రభుత్వం ప్రారంభిం చింది. క్లీన్ ఎనర్జీలో దేశాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. స్ట్రాటిజి క్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (ఎసఐజీహెచ్టీ) కింద, రిలయన్స్, ఆదానీ, ఎల్Ê టీ వంటి 15 కంపెనీలకు ఏటా 3వేల మెగావాట్ల తయారీకి కాంట్రాక్టులు అప్పగించింది. ఏటా 862,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 18 కంపెనీలకు ప్రభుత్వం కాంట్రాక్టు లు అప్పగించింది. ఇందులో భాగంగా 2025లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడు పోర్టులను హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులకు హబ్‌లుగా గుర్తించింది. అవి వరుసగా దీన్‌దయాల్ పోర్టు (గుజరాత్), వి.ఒ. చిదంబరనార్ పోర్టు (తమిళనాడు), పారాదీప్ పోర్ట్ (ఒడిశా). 2026లో దీనికి సంబంధించిన బిడ్డింగ్ కె.జి. హైడ్రోజన్‌కు 3`4 డాలర్లకు తగ్గగా, 2030 నాటికి ఇది 1.50`2 డాలర్లకు తగ్గించాలన్నది లక్ష్యం. 2030 డిసెంబర్ 31లోగా ప్రారంభించే ఈ ప్రాజెక్టులు, పునరుత్సాదక ఇంధన వనరులను ఉపయోగించినట్లయితే అంతర్ రాష్ట్ర పంపిణీ లో 25 సంవత్సరాల వరకు ఎటువంటి చార్జ్‌లను ప్రభుత్వం విధించబోదు. ఈవిధంగా కేంద్ర ప్రభుత్వం స్వల్పకాల, దీర్ఘకాల ప్రణాళికలతో దేశీయ ఇంధన సమస్యలను, పర్యావరణ హితంగా పరిష్కరించేదిశగా వ్యూహాలను అమలు చేస్తున్నది.
