
Vice Presidents Katika Reddy Buchanna Yadav.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర బీసీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యమిద్దాం
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్
కరీంనగర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ రాజధాని ఢిల్లీలో బీసీల డిమాండ్లపై ధర్నాలు ఆందోళనలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడం పట్ల తెలంగాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బుచ్చన్న యాదవ్ ఒక ప్రకటనలో బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థలలో విద్యా, ఉద్యోగ రంగాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ నలబై రెండు శాతం రిజర్వేషన్ ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపించి నెలలు గడిచిన దానిపై నేటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత కపట ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. నేను బీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకునే మోడీకి బీసీ డిమాండ్లు పట్టవా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీసీ బిల్లుకు మద్దతు పలికి కేంద్రంలో దానిని వ్యతిరేకంగా వ్యవహరించడం బిజెపి ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రగల్బాలు పలికిన బిజెపి నేతలు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం నుండి కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మిగతా ఎంపీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎంపీలను ఒప్పించి రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాలని లేకుంటే బీసీ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదల కోసం అంటూ 13వ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్లు పార్లమెంటులో బిల్లు పెట్టి అమలు చేసిందని కానీ బీసీల పట్ల మెతక వైఖరి వహించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి బీసీలకు రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై బీసీలంతా ఐక్యంగా ఉండి ప్రజా ఉద్యమాలు చేస్తామని కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ హెచ్చరించారు.