
# సమ్మె జయప్రదానికి యాజమాన్యాలకు సమ్మె నోటీస్
నర్సంపేట,నేటిధాత్రి :
ఈనెల 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె జయప్రదం చేయాలని కార్మిక సంఘాలైన బిఆర్టియు,సిఐటియు, ఏఐటియుసి,ఏఐఎఫ్టియు (న్యూ)ల
ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ గ్రేన్ మార్కెట్ కార్యదర్శి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కిరాణా వర్తక సంఘం, ఐరన్ అండ్ హార్డ్వేర్, ఫర్టిలైజర్ తదితర యాజమాన్యాలకు సమ్మె నోటీసులు అందించారు.ఈ సందర్భంగా బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అనంతగిరి రవి,ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుంపెల్లి మునీశ్వర్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాలను సవరణలు చేస్తుందని దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యతతో తిప్పికొట్టాలని అన్నారు. ఢిల్లీలో రైతులపై జరిగిన
దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.రైతాంగం పోరాటం చేసిన క్రమంలో గతంలో కేంద్ర ప్రభుత్వం రైతంగానికి అండగా ఉంటామని చెప్పి ఆందోళనల విరమించిన పిదప ఇప్పటివరకు కనీసం మద్దతు ధర కోసం పార్లమెంటులో చట్టం చేయలేదని అందుకు రైతులు ఈరోజు ఢిల్లీ ముట్టడిస్తే వారిపైన బాష్పవాయు భలాలను ప్రయోగించి లాఠీచార్జి చేయడం తగదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కందికొండ రాజు నాగులు జనార్ధన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.