
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పారా మిలటరీ బలగాలను దింపి రైతులపై దాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని శుక్రవారం భారత్ గ్రామీణ బందును చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుండాల సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం జరిగిన నీరసన కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పంథా) ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ , న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కోరం సీతరాములు, తుడుం దెబ్బ నాయకులు కోడెం వెంకటేశ్వర్లు, మోకాళ్ళ కన్నయ్య, భారత ముస్లిం మైనారిటీ గుండాల మండల అధ్యక్షులు ఎస్కే సాహెబ్ లు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసిందని వారు తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయమని రైతులు రోడ్లపైకి వస్తే రబ్బర్ బుల్లెట్లు భాష్వాయి గోళాలు పారా మిలిటరీ బలగాలతో లాటి ఛార్జ్ చేస్తూ రైతులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులపై అతి దారుణంగా దాడులు చేస్తూ మరో ప్రక్క రైతే రాజుగా ప్రభుత్వాలు చెబుతున్నాయని ప్రభుత్వాలు చెప్పే వన్ని బూటకపు మాటలుగా ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి ఉంటుందని అన్నారు. రైతులు ఢిల్లీలో చేస్తున్న శాంతియుత ఉద్యమానికి ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు అందరూ కూడా వారికి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల, సంఘాల నేతలు కొమరం శాంతయ్య, గడ్డం లాలయ్య,వాంకుడోత్ అజయ్,ఈసం కృష్ణ,పూనెం లక్ష్మయ్య,మానాల ఉపేందర్,కోడురి జగన్,సనప కిశేందర్, గట్టి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.