
కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీజిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల.మండల కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ సమ్మెలో ఆశా కార్యకర్తలు ఆటో కార్మికులు అమాలి కార్మికులు పాల్గొని సంపూర్ణంగా సమ్మెకు మద్దతు తెలియజేయడం జరిగిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి
మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని 12 గంటల పని దినాన్నితక్షణమే ఉపసంహరించుకోవాలని భవన నిర్మాణ కార్మికులకు ఆటో కార్మికులకు అమాలి కార్మికులకు అసంఘటితరంగా కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ స్కీం వర్కర్స్ ను రెగ్యులర్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నూతన విద్యా విధానం రద్దుచేసి అందరికీ ఉచిత విద్యను అందించాలని 12 గంటల పని దినాన్ని తక్షణమే ఉపసంహరించుకొని పాత పద్ధతిలో ఎనిమిది గంటల పని దినాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అని ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి కన్నూరు దానియల్ ఐరెడ్డి తిరుమల కట్ల సునీత సుజాత శాంత సరిత రాజేశ్వరి మానస రాజయ్య కుమారస్వామి కన్నూరి రమేష్ రాజయ్య తిరుపతి రాజేందర్ దేవరాజు షాపు యజమాని మచ్చసారయ్య పాల్గొన్నారు