కేంద్రం గౌడ సొసైటీలను గుర్తించి అభివృద్ధి చేయాలి

 మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి :

ప్రతి గ్రామంలో పాడి, వ్యవసాయ, మత్స్య సంఘాలను గుర్తించిన విధంగా గౌడ సొసైటీలను గుర్తించి అభివృద్ధి చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దుగ్గొండి మండలంలోని గిర్నీబావి తాటివనంలో మోకుదెబ్బ నూతన క్యాలెండరు ఆవిష్కరణ సోమవారం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర సహాకార శాఖ సహకార రంగం బలిపేతానికి 2021 లో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ, పాలు, మత్స్య సంఘాల ఏర్పాటు కోసం మార్గదర్శకాలను పంపిందన్నారు. వచ్చే 5 సంత్సరాలలో వివిధ పథకాలను అనుసంధానం చేస్తానని వాగ్దానం చేసిందని ఆయన వివరించారు. ఈ దిశగా అమలుకోసం కసరత్తు ప్రారంభమిందన్నారు. 2023 పిబ్రవరి 15 న పాడి, వ్యవసాయ, మత్స్య సంఘాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా తమిళనాడు, కర్ణాటక, ఛత్తిఎస్ఘడ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, తెలంగాణా రాష్ట్రలలో అనేక మంది గీత కార్మికులు గీత వృత్తిపై ఆదారపడి జీవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని ఆ మూడు సొసైటీలతో పాటు గౌడ సొసైటీ లను చేర్చి గీత కార్మికులకు న్యాయం చేయాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్,మందపల్లి గౌడ సంఘం అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు గౌడ్, రంగు వెంకటేశ్వర్లు గౌడ్, గోపగాని వెంకట్ గౌడ్, నాగపూరి మధు గౌడ్, సర్పంచ్ మహేందర్, రంగు మొగిలి గౌడ్, నవీన్, శివ,రంగు నర్సయ్య గౌడ్ (డబ్బా)కిరణ్, నవీన్, కర్ణాకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!