విభజన హామీల అమలులో కేంద్రం విఫలం: మంత్రి కేటీఆర్

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల రామారావు గారు తెలిపారు. కేటీఆర్ గారి వరంగల్ పర్యటన సందర్భంగా హనుమకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్స్ వద్ద తెలంగాణ విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వినోద్ లోక్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన విభజన మహా దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమ వంటి ప్రధాన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అమలకు చేయకపోవడం తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావలసిన వాటాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ప్రతి విషయంలో మొండి చేయి చూపిస్తున్నదని మండిపడ్డారు.తెలంగాణ ప్రాంతానికి సెంట్రల్ మైనింగ్ యూనివర్సిటీ నూతన రైల్వే మార్గాల ఏర్పాటు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఐటిఐఆర్ ప్రాజెక్టును మరియు సమ్మక్క సారలమ్మ మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వినోద్ లోక్ నాయక్ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ పై ప్రధాన మంత్రి గారి ప్రకటన కేవలం ఎన్నికల స్టంట్ లో భాగమేనని కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క విభజన అంశం మీద ఎందుకు నోరు విప్పలేదని విరుచుకుపడ్డారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం విభజన హామీలపై సానుకూల స్పందన చేయకపోతే ఢిల్లీ పీటలు కదిలించేలా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విభజన మహాదీక్షకు కేటీఆర్ గారితో పాటు బిఎస్పి నాయకులు కన్నం సునీల్,మాదారపు రవికుమార్,సిపిఎం నాయకులు చక్రపాణి,లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు రవీందర్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు మురళి నాయక్, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు భాస్కర్ నాయక్, సామాజిక న్యాయ సమితి అధ్యక్షులు సాంబయ్య తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విభజన హామీల సాధన సమితి రాష్ట్ర నాయకులు దేవోజి నాయక్, భూక్య హుస్సేన్,బానోత్ సునీల్ నాయక్,రవీందర్, మాలోత్ వెంకన్న, అజ్మీరా వెంకట్, భాస్కర్ నాయక్, సుధీర్ నాయక్,సురేష్ నాయక్, రవి నాయక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!