మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) కార్యాలయం ముందు సిపిఐ జెండా ఏఐటియుసి గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి, కొండు బానేష్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ 1925 డిసెంబర్ 26 న ఆవిర్భవించింది నాటి నుంచి నేటి వరకు నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం సిపిఐ పనిచేస్తుందని దున్నే వానికే భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీనీ ఎందరో కమ్యూనిస్టు యోధులు ఈ పార్టీ కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని వారిని పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఎన్నో పోరాటాలు కొనసాగించారని త్యాగాలు పోరాటాలు చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ ఒక్కటే అన్నారు.ఇది అజరామరమని దేశంలో పేదరికం ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా పోరాడుతునే ఉంటుందని దీనికోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యంగా ఈ దేశంలో అవినీతి పెరిగిపోయిందని దీనిని రూపుమాపాలంటే ఈ దేశంలో ఉన్న 30 శాతం యువత ముందుకు రావాలని కమ్యూనిస్టు పార్టీ చేరాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి సాలీగామ సంతోష్,
మలిశెట్టి సత్యనారాయణ మండల సహాయ కార్యదర్శి,
మాదారం టౌన్ కార్యదర్శి పట్టీ శంకర్,సముద్రాల ఆనంద్,
గజ్జల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.