
Hanuman temple
హనుమాన్ దేవాలయానికి సిమెంట్ పంపిణి.
కల్వకుర్తి / నేటి ధాత్రి :
కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని లింగసాని పల్లి గ్రామ హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల వెంకటేష్ గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ నిర్మాణానికి సహకరించమని కోరగా తన వంతుగా సిమెంట్ ని అందజేస్తానని తెలియజేసి, ఆలయ నిర్మాణానికి సిమెంట్ పంపారు.ఈ కార్యక్రమంలో లింగస్వామి పల్లి గ్రామ పెద్దలు రాములు,కిరణ్, శేఖర్ రెడ్డి పరశురాములు, భీమయ్య,సత్యం,శ్రీను, శంకర్ ,వెంకట్ రెడ్డి, వెంకటేశ్వరావు, రొడ్డ వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.