వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంఘం గ్రామ రేషన్ డీలర్ కంటానం మల్లయ్య స్వామి కుమార్తె సంధ్య – ప్రణవ్ ల వివాహ వేడుక బుధవారం రోజున ఝరాసంఘం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకీ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సిద్దం. ఉజ్వల్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పార్టీ ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్, కేతకీ ఆలయం చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, నర్సింహారెడ్డి., ఎస్సి సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి. నాగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, అశ్విన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ న్యాల్కల్, ఝరాసంఘం మండలాల అధ్యక్షుడు జి. కిరణ్ కుమార్ గౌడ్, రాఘవేందర్, మాజీ యం.పి.టి.సి హఫీజ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, నథానేయల్, నర్సింహా యాదవ్, ఇమామ్ పటేల్, రాజు మరియు ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.