
"Rajiv Gandhi Birth Anniversary Celebrated in Kalvakurthi"
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణంలో బుధవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో బృంగి ఆనంద్ కుమార్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లేపల్లి జగన్,మాజీ కౌన్సిలర్లు చిన్న రాంరెడ్డి, ఎజాస్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్,నాయకులు వర్కాల భాస్కర్ రెడ్డి,ముత్యాలు,పాండురంగారెడ్డి, ఆంజనేయులు,మాజీ సర్పంచ్ బాలరాజు,జమ్ముల శ్రీకాంత్,సంతు యాదవ్,నాని యాదవ్,రేష్మ బేగం, రెహానా బేగం,దున్న సురేష్, సుభాని,నవీన్ తదితరులు పాల్గొన్నారు.