నాగారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు
అంబెడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన డాక్టర్ సిరంగి సంతోష్,రాజభద్రయ్య
పరకాల నేటిధాత్రి
మండలం లోని నాగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,మున్సిపల్ మాజీ చైర్మన్ మార్తా రాజ భద్రయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,జిల్లా కౌన్సిల్ మెంబెర్ బాబు యాదవ్,కన్వీనర్ కొమ్మిడి మహేందర్ రెడ్డి,కార్యక్రమ కో కన్వీనర్ లు దుమల నగేష్,కునూరు విరస్వామి,జనరల్ సెక్రటరీ జంగిలి రాజేందర్ రావు,కోశాదికారి ఎదునూరి లింగయ్య,సీనియర్ నాయకులు గుండబోయిన నర్సయ్య,పుచ్చకాయల మల్లారెడ్డి,బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్,బూత్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,బిక్షపతి,గొట్టే మొగిలి,పైడిపెల్లి మాజీ సర్పంచ్ సురేష్,పోచారం బూత్ అధ్యక్షులు గంపలపెళ్ళి రాజు,లక్ష్మిపురం బూత్ అధ్యక్షులు సంపత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.