
సాహితీ మేరు నగ ధీరుడు సినారే జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె జయంతి ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమం అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సాహితి సముద్రుడు మేరు నగ ధీరుడు తెలుగు వెలుగును, తెలుగు కవితను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, కడలి దాటించిన తొలి తెలంగాణ జ్ఞానపీఠ సాహితీ శిఖరం, అవార్డు గ్రహీత డాక్టర్ సినారె, అంటూ పద్యాలను ఆలాపించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆకునూరి ఎల్లయ్య మాట్లాడుతూ సినారే వారి సినీ పాటలు కవిత్వము జగము నకు తెలిసిన మహానుభావులు అన్నారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ గులేబకావళి కథలో గుబాలింపజేసే సాహిత్యాన్ని విరచించి, సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతిభాశాలి సినారే. అని అన్నారు. సహాధ్యక్షులు కోడం నారాయణ మాట్లాడుతూ సి.నారాయణ రెడ్డి ప్రముఖ కవిగా, గాయకుడిగా, బోధకుడిగా గురువుగా, మరి సాహిత్యంలో ఎనలేని సేవ చేసినటువంటి ప్రముఖ కవిగా మరియు సినిమాకు రంగంలో పాత్రకు తగ్గట్టుగా పాటలు రాసి మన్నన పొందినాడు. మన తెలంగాణకే ఒక మణి,మకుటమై నిలిచినారు అని అన్నారు. ఉపాధ్యక్షులు బూర దేవానందం కవితా గానం ఆలాపించారు,గుండెల్లి వంశీ కవిత గానాన్ని అలా పించారు,చారి తదితరులు పాల్గొన్నారు