కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు..
అనంతరం మాట్లాడుతూ
హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుండి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య స్వేచ్ఛను పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు..
గత ప్రభుత్వంల కాకుండా ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యను పరిష్కరిస్తూన్న ప్రజా పాలన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని అన్నారు…
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతు రాజ్యం ప్రజాపాలనలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తు రాష్ట్ర ప్రజలను మరియు రైతులను, యువతను దృష్టిలో పెట్టుకుని పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా మరియు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో
మాజీ చిరమళ్ళ ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల మహిళా అధ్యక్షురాలు చందా రత్నమ్మ ,మండల నాయకులు భూక్య అర్జున్, పోలెబోయిన సీతారాంబాబు, వజ్జా మహేష్, గాంధర్ల రామనాథం, కన్నయ్య , నవీన్ గోగు కిరణ్ గారు, లింగయ్య, యువకులు షేక్ ఇలియాస్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు…