
నర్సంపేట,నేటిధాత్రి :
లంబాడా-గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు నర్సంపేట మండలంలోని బుచ్చినాయక్ తండా గ్రామంలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో కార్యక్రమం చేపట్టారు.ముందుగా బంజారా కులదైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన వారి జాతికి చేసిన సేవలను గుర్తుకు చేశారు.ఈ కార్యక్రమంలో కుల పెద్ద అజ్మీర జంపయ్య నాయక్, జరూపుల సారయ్య నాయక్,జరుపుల వీరన్న నాయక్, అజ్మీర కోటయ్య నాయక్, వాంకుడోత్ చందా నాయక్, అజ్మీర జితేందర్ నాయక్, అజ్మీర రాజు నాయక్,, జరుపుల బద్రు నాయక్, శివ, శంకర్, కళ్యాణ్, సుమన్,గణేష్,రాజేంద్రప్రసాద్ ,స్వామి, రాకేష్, నెహ్రూ తోపాటు పలువురు బంజారా నాయకులు, తండా వాసులు పాల్గొన్నారు.