
నర్సంపేట,నేటిధాత్రి :
ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగను ఆ మతస్థులు ఘనంగా జరుపుకున్నారు.పట్టణంలోని మాదన్నపేట రోడ్డుకు గల ఈద్గా యందు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంజాన్ మాసం మొదలైన నాటి నుండి 30 రోజులు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు మంగళవారం నెల వంకను చూసి వారి యొక్క భక్తిని చాటుకున్నారు.ఈ నేపథ్యంలో రంజాన్ ప్రత్యేకత తరాబి నమాజును పట్టించి 31 వ రోజున ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక నమాజ్ ఈద్గాలో జరుపుకున్నారు. ఈ నమాజ్ ను ముస్లిం మత గురువు ఇమామ్ హబీబుల్ రహమాన్ చేపట్టారు. అనంతరం పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.వివిధ కారణాలతో చనిపోయిన బంధువుల పేరుపై దానధర్మాలు చేస్తూ ముస్లిం స్మశాన వాటికకు వెళ్లి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.ఈ సందర్భంగా కుల మతాలకతీతంగా ఒకరికొకరు స్నేహభావం ప్రేమను చాటుకుంటూ అలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుకున్ననారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్, జామా మజీద్ సదర్ మహ్మద్ నబీ సాబ్, కార్యదర్శి మహమ్మద్ హబీబ్, మహమ్మద్ మసూద్ అలీబేగ్, మహ్మద్ అయు ఖాన్, మహమ్మద్ నూమాన్, మహమ్మద్ యూసుఫ్, మహమ్మద్ సమ్ దాని తదితర ముస్లింలు పాల్గొన్నారు.