*ఎంపీ వద్దిరాజు స్వగ్రామం ఇనుగుర్తిలో తమ్ముడు వెంకటేశ్వర్లు నూతన గృహ ప్రవేశం,కూతురు అఖిలాండేశ్వరి నిశ్చితార్థం**
*నేటిధాత్రి హనుమకొండ*
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తమ్ముడు వద్దిరాజు వెంకటేశ్వర్లు-పద్మల కూతురు అఖిలాండేశ్వరి నిశ్చితార్థం హైదరాబాద్ నివాసి ప్రణవ శ్రీనివాస్ -శ్రీలతల కుమారుడు కైలాస్ తో ఘనంగా జరిగింది.
వారి సొంతూరు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో వెంకటేశ్వర్లు-పద్మ దంపతులు శుక్రవారం తెల్లవారుజామున వేద పండితులతో హోమం, సత్యనారాయణ వ్రతం జరిపించి నూతన గృహప్రవేశం చేశారు.
ఆ తర్వాత నూతన గృహం ఆవరణలో పూలతో అందంగా అలంకరించిన వేదికపై అఖిలాండేశ్వరి-కైలాస్ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలకు వద్దిరాజు సోదరులు తమ కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి హాజరై అక్షింతలు వేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.ఈ వేడుకలకు వద్దిరాజు వెంకటేశ్వర్లు మాతృమూర్తి కమలమ్మ, వద్దిరాజు కిషన్-శశిరేఖ, వద్దిరాజు దేవేందర్-ఇందిర, వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ,వద్దిరాజు మోహన్ -వాసవి,వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరి తదితరులు హాజరై కాబోయే వధూవరులకు తమ ఆశీస్సులు అందజేశారు.
అలాగే,వద్దిరాజు వెంకటేశ్వర్లు అక్కాబావ శీలం లక్ష్మీ-సత్యనారాయణ,అక్క సంగిశెట్టి పద్మ,అన్నల కూతుళ్లు-అల్లుళ్లు సునీత-డాక్టర్ జే.ఏన్.వెంకట్, డాక్టర్ గంగుల గంగాభవాని -సందీప్, వెంకటేశ్వర్లు అన్నల కుమారులు వద్దిరాజు శ్రీనివాస్ -శిల్ప, నిఖిల్ చంద్ర-అనీల,వద్దిరాజు నాగరాజు, వద్దిరాజు ప్రీతమ్,వద్దిరాజు గిరినందన్ తదితరులు కాబోయే వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అఖిలాండేశ్వరి అన్న వద్దిరాజు అఖిల్, కైలాస్ తమ్ముడు కార్తీక్ అతిథులు,బంధుమిత్రులకు సాదర స్వాగతం పలికారు.కాబోయే వధూవరులు అఖిలాండేశ్వరి-కైలాస్ లతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కేక్ కట్ చేయించారు.