గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ స్వీట్ల పంపిణీ చేసిన నాయకులు
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలం లోని మళ్ళక్కపేట గ్రామంలో కాంగ్రేస్ పార్టీ నూతనంగా ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ లో భాగంగా మహాలక్ష్మి పథకం లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ఆరోగ్య శ్రీ పథకం కింద 5లక్షలకు ఉన్న దానిని 10 లక్షల కి పెంచినా దానిని గూర్చి వివరిస్తూ స్వీట్ల పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో గ్రామకమిటి అధ్యక్షుడు మామునురి రాజు పరకాల మండల యూత్ కాంగ్రేస్ అధ్యక్షుడు దొమ్మటి కృష్ణకాంత్,సీనియర్ నాయకులు వెనుకమూరి మహేంద్ర,తిక్క పాల్,పైడిపాల రామన్న,బాలక్రిష్ణ,చెన్న రాజేందర్,గురిజాల రాజేందర్, మరియు గ్రామ మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.