నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండల కేంద్రంలోని
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయంపరిపాలన దినోత్సవం వేడుకను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా ఒకరోజు ఉపాధ్యాయులుగా,అధికారులుగా విద్యార్థులు వ్యవహరించారు.కాగా ప్రధానోపాధ్యాయురాలిగా తాళ్ల రుచిత, జిల్లా విద్యాశాఖ అధికారిగా బత్తుల నవ్య వ్యవహరించగా ఉపాధ్యాయులుగా ఝాన్సీ, హరిణి, అక్షయ, శ్రావణి ధరణి శ్రీజ హారిక అంజలి రక్షిత, జెస్సికా రాణి, ఆకాష్, రాహుల్, సర్జిత్, పవన్ కుమార్, నవదీప్, దిలీప్, వెంకటేష్, రేవంత్, మోహన్, హరికృష్ణ, చరణ్, సిద్ధార్థలు తరగతి గదుల్లో పాఠాలు బోధించారు.ఈ నేపథ్యంలో పాఠశాల ఉపాద్యాయులు ఎస్కే హమ్మద్, సంధ్యారాణి న్యాయనిర్ణేతలు పర్యవేక్షణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం ప్రధానోపాధ్యాయులు రామస్వామి అధ్యక్షతన జరిగింది.కాగా ఒకరోజు ఉపాధ్యాయులుగా ,అధికారులుగా వ్యవహరించిన విద్యార్థులకు భహుమతులు అందజేసి అభినందించారు.