
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ఎంపీ రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు సందర్భంగా మండల లో బుధవారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ కోపం ద్వేషం కన్నీళ్లకు వ్యతిరేకంగా నిలబడ్డ నేత రాహుల్ గాంధీ అని ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడన వ్యక్తి అని వెల్తురు చిందిస్తూ ఆశను రేపాడని సడలిని పట్టుదలతో రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ పోరాడిన వ్యక్తి అని అన్నారు సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన సంతోష జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ ఎస్సీ ఎస్టీ వైస్ చైర్మన్ దూడపాక శంకర్ మాజీ సర్పంచ్ నారగాని దేవేందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంపటి భువన సుందర్ ముత్యాల రాజయ్య బోనాల రాజమౌళి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఆరుమూల ఎల్ల స్వామి అప్పం కిషన్ కటుకూరి శ్రీనివాస్ దూడపాక దుర్గయ్య ముప్పిడి శంకర్ రాజు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు