రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని బీ జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక సంఘం గౌరవాధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి లు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… కార్మికులకు, కర్షకులకు 138వ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.కార్మికులు ఒకవైపు రక్తం చిందించుతుంటే మరోవైపు ఆ రక్తంలో తడచిన చుక్కలతోనే తమ పోరాటానికి చిహ్నంగా ఎర్రజెండా పైకెత్తి ధనికుల, భూస్వాముల, పెత్తందారుల, దోపిడీదారుల గుండెలు పగిలిపోయేలా చేసిన కార్మికుల ఐక్యత పోరాట రూపమే మేడే అని తెలిపారు. ప్రతి ఏడాది మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. చికాగో ఇప్పుడు స్ఫూర్తిని పొంది ప్రజా పోరాటాల ద్వారా కార్మికుల హక్కులు సాధించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు శంకర్ ,మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, కార్యదర్శి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజయ్య, సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు.