నర్సంపేట టౌన్,నేటిధాత్రి :
అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని
విజ్ డమ్ హై స్కూల్, ప్రీ స్కూల్ లో వేర్వేరుగా వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో జరిగిన కార్యక్రమాలలో విజ్ డమ్ హై స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా లు మాట్లాడుతూ బాలికలకు చదువు అత్యంత అవసరమని, తన కుటుంబ రూపురేఖలను మార్చగల సత్తా కేవలం మహిళలకే ఉందని అన్నారు. నేడు అన్ని రంగాలలో పురుషులతో సమాన అవకాశాలు మహిళలకు ఉన్నాయని తెలిపారు.బాలికలు ఏకాగ్రతతో చదివి తమ జీవిత లక్ష్యాలను సాధించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జావేద్,వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, అకాడమిక్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ అధ్యాపకులు హారిక, జాఫర్, ప్రశాంత్ కుమార్, పూజ, సమత, రవళి, రమాదేవి, దివ్య, సరితా రాణి, మాధవి, రాధిక, అఖిల, సౌజన్య, అనిత, స్వప్న, స్వాతి, యాస్మీన్, శ్రీలత, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.