ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు, బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల కార్యక్రమం లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఇందిరాగాంధీ 107వ జయంతిని పురస్కరించుకుని భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకల్లో ముఖ్య అతిధులుగా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి పాల్గొని ఇందిరాగాంధీ చిత్ర పటం, విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఇందిరాగాంధీ తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ దేశ సమగ్రత, సమైకత్య, పటిష్టత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుని ఆమె ముందుకు సాగారని కొనియాడారు. ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను ఆదర్శంగా తీసుకుందనీ, ఆ మహనీయురాలి స్ఫూర్తితోనే పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాపాలనలో ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర కొమురయ్య కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ ముంజల రవీందర్ స్వామి అంబాల శ్రీనివాస్ క్యాతిరాజ్ సాంబమూర్తి ఉడుత మహేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు