రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈసందర్భంగా అలువాల విష్ణు మాట్లాడుతూ నేటి తరానికి ఆదర్శప్రాయుడు, ఉద్యమ దిశాలి, తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. సహకార సంఘాల స్థాపించి, వాటి అభ్యున్నతి కొరకు పాటుపడిన బడుగు బలహీన వర్గాల వసతి, వసతి గృహాలు ఏర్పాటుకు కృషి చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషదాయకమని, పద్మశాలి కుల బాంధవులందరు కూడా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉండే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని, నేటితరం నాయకులకు బాపూజీ ఒక దిక్సూచి లాంటివారని వారి అడుగుజాడల్లో మనమందరం ముందుకు సాగాలన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీలో ఎముకలు కోరికే చలిలో కూడా పది రోజులు దీక్ష చేపట్టి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, తన ఇంటినే ఉద్యమ బాటగా కార్యచరణలో ముందుకు తీసుకు వచ్చినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సమసమాజ నిర్మాణానికి పునాదులు వేసినటువంటి గొప్ప మేరు నగదీరుడన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక కమలాకర్, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మచ్చ గంగయ్య, కొలిపాక మల్లేశం, పద్మశాలి సంఘం నాయకులు సిరిపురం సత్యనారాయణ, మచ్చ లచ్చయ్య, మామిడాల పర్షరాములు, కొలిపాక నాగరాజు, నల్ల అంజయ్య, బూర్ల రామచంద్రం, కొలిపాక రాములు, లక్ష్మణ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్, అజయ్, రుద్ర రాజు, సుధాకర్, తిరుమల్, రవి, వెంకటస్వామి, ఇస్తారి, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నా